విశాఖలో రైలుపై విరిగిపడిన కొండచరియలు

- June 30, 2017 , by Maagulf
విశాఖలో రైలుపై విరిగిపడిన కొండచరియలు

విశాఖపట్నంలోని కొత్తవలస- కిరండోల్ రైలు మార్గంలో శుక్రవారం కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొండపై నుంచి ఓ గూడ్స్ రైలుపై కొండచరియలు విరిగిపడటంతో రైలు ఇంజిన్లు దెబ్బతిన్నాయి. శివలింగాపురం- టైడా రైల్వేస్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. దీంతో కొత్తవలస - కిరండోల్ ప్యాసింజర్ రైలును కూడా అధికారులు నిలిపివేశారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. రైళ్ల రాకపోకల్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు అధికారులు తెలిపారు. గంటల తరబడి రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com