సినిమా టిక్కెట్ల పై నో ఎఫెక్ట్
- June 30, 2017
తెలంగాణా సినిమా ప్రేక్షకుడికో శుభవార్త ! రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు పెంచబోవడం లేదని ప్రభుత్వం ప్రకటించింది. టిక్కెట్ల రేట్లు పెంచుతూ వారం రోజుల కిందట విడుదల చేసిన జీవోను తాత్కాలికంగా నిలిపివేసింది టీ-సర్కార్. జీఎస్టీ అమలు తర్వాత ఏర్పడే పర్యవసానాలను పరిశీలించిన తర్వాత టిక్కెట్ ధరల పెంపుపై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది.
నేల టిక్కెట్ రూ. 40 లకు పెంచాలని, ఏసీ థియేటర్లో రూ.70 ఉన్న గరిష్ఠ టికెట్టు ధర ఒక్కసారిగా రూ.120కి పెంచాలని, మల్టీప్లెక్స్‌లలో ఒక్కో టికెట్టుపై రూ.50 పెంపును వర్తింపజేశారు. ఆయా శ్రేణులను బట్టి టికెట్టు ధరలు రూ.200-300 మధ్యే ఉండాలని, తెరకు ముందుండే రెండు వరుసల సీట్లకు గరిష్ఠ ధరలో 20% తగ్గింపునివ్వాలని గత ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఆ జీవో ఇప్పుడు వెనక్కెళ్ళిపోవడంతో.. సినీ వర్గాలు ధియేటర్ యాజమాన్యాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
తాజా వార్తలు
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!







