విడుదలైన శమంతకమణి ట్రైలర్

- June 30, 2017 , by Maagulf
విడుదలైన శమంతకమణి ట్రైలర్

భలే మంచి రోజు సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వస్తున్న సెకండ్ మూవీ శమంతకమణి. సుధీర్ బాబు, సందీప్ కిషన్, నారా రోహిత్, ఆది నలుగు యువ హీరోలు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది.

నారా రోహిత్ పోలీస్ పాత్ర ఒక్కటి తప్ప మిగతా క్యారక్టర్స్ ఏమి అర్ధం కాకపోయినా కుర్రాళ్లు మాత్రం ఎవరికి వారు ఇరగొట్టేశారని అనిపిస్తుంది. ఆది డిఫరెంట్ గా కనబడుతుండగా.. సందీప్ కిషన్ కూడా కొత్తగా ఉన్నాడు. ఇక సుధీర్ బాబు మాన్లీ లుక్స్ తో సూపర్ అనిపిస్తున్నాడు. రోహిత్ యాస్ యూజువల్ పోలీస్ గా అదరగొట్టాడు.

శమంతకమణి అనే కారు చుట్టూ తిరిగే ఈ సినిమా స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీగా రాబోతుందని తెలుస్తుంది. ట్రైలర్ చాలా కొత్తగా ఇంప్రెసివ్ గా ఉంది. నలుగురు యువ హీరోలతో శ్రీరాం ఆదిత్య చేసిన ఈ ప్రయత్నం చాలా గొప్పదని చెప్పొచ్చు. కుర్ర డైరక్టరే అయినా మనోడిలో టాలెంట్ టన్నుల కొద్ది ఉన్నట్టుంది.

రిలీజ్ అయిన ట్రైలర్ అయితే అదుర్స్ అనేస్తున్నారు ప్రేక్షకులు. యువ హీరోల మల్టీస్టారర్ మూవీగా రాబోతున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ట్రైలర్ తో ఇంప్రెస్ చేసిన వీరు సినిమాను ఇంకా అదరగొట్టేస్తారని ఫిక్స్ అయిపోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com