విమాన కేబిన్ లో పొగలు

- June 30, 2017 , by Maagulf
విమాన కేబిన్ లో పొగలు

బిహార్లోని పట్నా విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం క్యాబిన్లో నుంచి పొగలు రావడం గమనించిన సిబ్బంది వెంటనే విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. తొలుత టేకాఫ్ సమయంలో విమానం టైర్లు పేలిపోయిన కారణంగా విమానాన్ని ఆపినట్లు అంతా అనుకున్నారు. కానీ క్యాబిన్లో నుంచి మంటలు రావడం వల్లే విమానాన్ని నిలిపివేసినట్టు ఇండిగో అధికారులు స్పష్టం చేశారు. విమానంలో ఉన్న 174 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని ఇండిగో ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనపై డీజీసీఏకు తెలియజేశామని, విచారణ జరుగుతోందని విమాన సంస్థ తెలిపింది.

రన్వేపై విమానాన్ని నిలిచిపోవడం వల్ల విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదం కారణంగా భాజపా నేత సుశీల్కుమార్ మోదీ, కేంద్ర మంత్రి రామ్ క్రిపాల్ యాదవ్, ఇతర భాజపా నేతలు విమానాశ్రయంలోనే ఇరుక్కుపోయారు. రన్వేపై విమానం ఉండటం వల్ల భాజపా నేతలు వెళ్లాల్సిన విమానం అలస్యమయింది. పార్లమెంటులో జరిగే జీఎస్టీ ఆరంభ వేడుకలకు ఈ నేతలందరూ హాజరయ్యేందుకు దిల్లీ పయనమయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com