మొదలైన జీఎస్టీ స్వాగత కార్యక్రమం

- June 30, 2017 , by Maagulf
మొదలైన జీఎస్టీ స్వాగత కార్యక్రమం

పార్లమెంటు సెంట్రల్ హాల్లో జీఎస్టీకి స్వాగత కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని దేవగౌడ, కేంద్రమంత్రులు ఆరుణ్జైట్లీ, వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్, అశోక్గజపతిరాజు, మేనకాగాంధీ, రామ్విలాస్ పాసవాన్, ఉమాభారతి, నితిన్గడ్కరీ, అనంత్కుమార్తో పాటు పలువురు కేంద్రమంత్రులు, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్షా, సీనియర్నేత ఎల్కే ఆడ్వాణీ, పారిశ్రామిక వేత్త రతన్టాటా, తదితరులు హాజరయ్యారు. ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ సుమిత్రామహాజన్, కేంద్రమంత్రులు పార్లమెంట్ సెంట్రల్ హాలు వద్ద రాష్ట్రపతి ప్రణబ్కు స్వాగతం పలికారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com