విమానాశ్రయంలో డిపార్చర్‌ ఫారంను రద్దు చేసిన కేంద్ర హోం శాఖ

- June 30, 2017 , by Maagulf
విమానాశ్రయంలో డిపార్చర్‌ ఫారంను రద్దు చేసిన కేంద్ర హోం శాఖ

విదేశాలకు వెళ్లే ప్రయాణికులు సర్వసాధారణంగా విమానాశ్రయాల్లో నింపే నిష్క్రమణ(డిపార్చర్‌) ఫారంను రద్దు చేసినట్లు కేంద్ర హోం శాఖ శుక్రవారం ప్రకటించింది. జూలై 1 నుంచే ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలిపింది. విమానాల్లో విదేశాలకు వెళ్లే భారతీయులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. రైలు, రోడ్డు, నౌకల ద్వారా విదేశాలకు వేళ్లే వాళ్లు యథావిధిగా నిష్క్రమణ ఫారంను నింపాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రయాణానికి ముందు గందరగోళాన్ని, సమయం వృథాను నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోం శాఖ తెలిపింది. ఇన్నాళ్లూ విదేశాలకు వెళ్లే ప్రయాణీకులు పేరు, అడ్రస్‌, జన్మదిన వివరాలతో పాటు పాన్‌కార్డు, విమాన వివరాలు పేర్కొన్న నిష్క్రమణ కార్డు ఫారంను సంబంధిత విమానాశ్రయ అధికారులకు ఇవ్వాల్సి ఉండేది. ఇప్పుడు ఆ సమాచారం వేరే రూపంలో లభ్యంకావడంతో ఆ విధానాన్ని రద్దు చేసినట్లు హోం శాఖ తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com