రైలు ప్రయాణాల్లో గుర్తింపుకార్డుగా ఈ-ఆధార్ కు ఓకే
- June 30, 2017
రైలు ప్రయాణాల్లో గుర్తింపుకార్డుగా చూపడానికి ఇకమీదట ఈ-ఆధార్ ప్రింటింగ్ కాపీనీ అనుమతించనున్నారు. ఈమేరకు రైల్వేశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకూ ఒరిజినల్ ఆధార్‌ను మాత్రమే ఇందుకోసం అనుమతించేవారు. ప్రస్తుతం ఆస్థానంలో ఈ-ఆధార్‌కూ అవకాశం కల్పించారు. వీటితోపాటు ఎన్నికల గుర్తింపుకార్డు, పాస్‌పోర్టు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన ఫొటో గుర్తింపుకార్డు (సీరియల్ నెంబర్ ఉండాలి), పాఠశాలలు, కాలేజీలు జారీచేసిన విద్యార్థి గుర్తింపుకార్డులు, జాతీయ బ్యాంకుల పాస్‌బుక్కులు (ఫొటోతోసహా), ల్యామినేటెడ్ బ్యాంకు క్రెడిట్‌కార్డులు, రేషన్‌కార్డులను గుర్తింపుకార్డులుగా అనుమతిస్తారు.
తాజా వార్తలు
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్‌తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
- బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ప్రకటించిన NATS
- రౌదత్ అల్ ఘెజ్లానియా స్ట్రీట్ 15 రోజుల పాటు మూసివేత..!!
- అమెరికాకు షాకిచ్చిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో మొట్టమొదటి బయోమెట్రిక్ పేమెంట్స్ ప్రారంభం..!!







