సేవలను మరింత విస్తరించిన భారత రైల్వే
- July 01, 2017
భారతీయ రైల్వే జులై 1 నుంచి తన సేవలను మరింత విస్తరించనుంది. పలు నియమనిబంధనల్లో మార్పులు తీసుకురానుంది. రిజర్వేషన్‌కు సంబంధించిన అంశాల్లో పలు సవరణలు చేసింది. జులై 1 నుంచి ఆన్లైన్లో వెయిటింగ్ టిక్కెట్ జారీ చేయరు. దీనితోపాటు శతాబ్ధి, రాజధాని తదితర రైళ్లలో కోచ్‌ల సంఖ్య పెరగనుంది. రిజర్వేషన్‌తో కూడిన తత్కాల్ టిక్కెట్‌ను రద్దుచేసుకుంటే సగం మొత్తం రిఫండ్ ఇవ్వనున్నారు. దీనితోపాటు ప్రయాణికులకు వారు కోరిన మీదట స్థానిక భాషతో కూడిన టిక్కెట్ ఇవ్వనున్నారు. శతాబ్ధి, రాజధాని, దురంతో తదితర ఎక్స్‌ప్రెస్‌ల ప్రయాణవేగం పెరగనుంది. వీటిలో ఇకపై కన్ఫర్మ్ టిక్కెట్‌ను మాత్రమే ఇవ్వనున్నారు. టిక్కెట్ రద్దు చేసుకున్న పక్షంలో కోచ్ తరహాను అనుసరించి సగం మొత్తాన్ని చెల్లించనున్నారు. ఏసీ, సెంకెడ్ క్లాస్ టిక్కెట్ రద్దు చేసుకుంటే 100 రూపాయలకు మించి కోత పడనుంది. ఏసీ థర్డ్ కు 90 రూపాయలు, స్లీపర్ క్లాస్ టిక్కెట్‌ను రద్దుచేసుకుంటే 60 రూపాయలకు మించి కోత విధించనున్నారు. కాగా కాగితం రూపంలో టిక్కెట్ ఇవ్వడం మానివేస్తారని వస్తున్నఆరోపణల్లో నిజం లేదని రైల్వేశాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







