విమానంలో వాటర్ లీక్
- July 01, 2017
విమానంలో ప్రయాణిస్తున్న వారికి వింత అనుభవం ఎదురైంది. విమానం సీలింగ్ నుంచి నీళ్లు కారి ప్రయాణికులపై పడ్డాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అమెరికాలోని అట్లాంటా నుంచి ఫ్లోరిడా వెళ్తున్న డెల్టా ఎయిర్లైన్స్ విమానంలో ఇది జరిగింది. టామ్ మెక్కుల్లా అనే ప్రయాణికులు ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది.
మెక్కుల్లా కూర్చున్న సీటుపై నీళ్లు పడుతుండటాన్ని గమనించి.. మ్యాగజైన్ను అడ్డుగా పెట్టుకున్నాడు. నీళ్లు మ్యాగజైన్ మీద నుంచి కిందకి పడిపోవడం ఆ వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. ఆయనతో పాటు మరికొందరు ప్రయాణికులు కూడా ఇదే సమస్యను ఎదుర్కొన్నారు. విమానం సీలింగ్ నుంచి నీళ్లు అలా ఎందుకు వచ్చాయనే విషయం మాత్రం తెలియలేదు. విమానంలో వేరే సీట్లు ఖాళీగా లేకపోవడంతో చేసేదేమి లేక వాళ్ల సీట్లలోనే నీళ్లు పడుతున్నా కూర్చున్నారు. మెక్కుల్లాకు కలిగిన ఇబ్బందికి విమాన సంస్థ మూల్యం చెల్లించింది. 100డాలర్ల ఓచర్ను మెక్కుల్లాకు డెల్టా కంపెనీ ఇచ్చింది.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







