'గోల్డ్' ఫస్ట్ లుక్ ను షేర్ చేసిన అక్షయ్

- July 02, 2017 , by Maagulf
'గోల్డ్' ఫస్ట్ లుక్ ను షేర్ చేసిన అక్షయ్

బాలీవుడ్ నటుడు అక్షయ్కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'గోల్డ్'. ఈ చిత్ర ఫస్ట్లుక్ను అక్షయ్ తన ట్విటర్ ద్వారా విడుదల చేశారు. స్వాతంత్య్రం అనంతరం 1948 లండన్ ఒలింపిక్స్లో భారత్ సాధించిన తొలి స్వర్ణ పతకం నేపథ్యంలో ఈ చిత్రాన్ని రీమాకట్గి తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్లుక్లో అక్షయ్ పాతకాలం మనిషిగా కన్పిస్తూ ఆకట్టుకున్నారు. రితేశ్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో అక్షయ్కి జోడీగా బుల్లి తెర నటి మౌని రాయ్ నటిస్తున్నారు. స్వాత్రంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈచిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com