ఆశాజనకంగా గృహ కార్మికుల నియామకాలు
- July 02, 2017మనామ: పార్లమెంటరీ ప్రతిపాదన ఆమోదించినట్లయితే ఇళ్లలో పనిచేసే కార్మికులనియామకం ప్రభుత్వ యాజమాన్య సంస్థ ద్వారా నిర్వహించబడుతుంది. ఈ ప్రతిపాదనకు సంబంధించి ప్రతినిధుల సభ మంగళవారం ఓటు వేయాలని ప్రతిపాదించింది, ఇది ఆమోదించినట్లయితే, దేశీయ కార్మికుల ప్రత్యేక ప్రభుత్వ సంస్థ ద్వారా నియామకం చేయబడుతుంది. అదే విధంగా రాజ్యంలో ప్రైవేట్ నియామక సంస్థల గుత్తాధిపత్యం ఈ చర్యతో ముగియనుంది. ఈ నియామకంలో పారదర్శకత మరియు జవాబుదారీతత్వాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇళ్లలో పనిచేసే కార్మికుల నియామకంలో ఏజెంట్ల ఇష్టారాజ్యం గృహ కార్మికులపై దోపిడీకి పాల్పడే విధానం అంతంతమవుతుంది. ప్రతిపాదన ప్రకారం, లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ సంస్థ ఇళ్లల్లో పనిచేసే కార్మికుల నియామక ప్రక్రియను క్షుణంగా పర్యవేక్షిస్తుంది. అయితే లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ సంస్థ యొక్క రెగ్యులర్ బాధ్యతలకు లోబడి లేనందున ప్రతిపాదనను పునఃపరిశీలించాలని ఎంపీలు వినతి అందించారు. పరిశ్రమ, వాణిజ్య మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ సైతం ఈ ప్రతిపాదనకు అంగీకరించలేదు, ప్రతిపాదనకు మంత్రిత్వ శాఖ యొక్క ప్రత్యేకతల్లో ప్రతిపాదన లేదని ఎంపీలకు చెప్పిన ఒక లేఖలో వారు పేర్కొన్నారు. లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ సంస్థ మరియు మంత్రిత్వ శాఖ అధికారుల సమక్షంలో, మంగళవారం ప్రతినిధుల సభ యొక్క రెగ్యులర్ సమావేశంలో ఈ ప్రతిపాదన చర్చించబడింది మరియు ఇందుకై ఓటు చేయబడుతుంది.
తాజా వార్తలు
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్







