త్రిపాత్రాభినయం చేయనున్న ఎన్టీఆర్

- July 02, 2017 , by Maagulf
త్రిపాత్రాభినయం చేయనున్న ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్ ను రంజాన్ సందర్భంగా రిలీజ్ చేయాలని భావించారు. అయితే ఈ లోగా టీజర్ రఫ్ కట్ ఆన్ లైన్ లో లీక్ అవ్వటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ కు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు చిత్ర నిర్మాతలు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. అందుకే ఆ మూడు పాత్రలకు సంబంధించిన మూడు వేరు వేరు టీజర్ లను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముందుగా జూలై 6 సాయంత్ర 5 గంటల 22 నిమిషాలకు జై పాత్రకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేస్తున్నారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రపై భారీ అంచనాలు ఉన్నాయి. మిగతా రెండు టీజర్ లను త్వరలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com