దేశం విడిచివెళ్ళేవారికి ఖతార్ ఆంక్షలు
- July 02, 2017
ఖతార్ ప్రభుత్వం తమ పౌరులు, నివాసితులు దేశం విడిచి వెళ్ళేందుకు ఆంక్షలు విధించింది. కొన్ని విభాగాలకు చెందినవారికి లీవ్ మంజూరు చేయకుండా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ శాఖలకు చెందినవారిపై ఈ బ్యాన్ విధించడం జరిగింది. దేశంలో ప్రత్యేక పరిస్థితుల కారణంగా పౌరులు, నివాసితులకు ఎలాంటి సమస్యలూ రాకుండా చూసే ఉద్దేశ్యంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే సంక్షోభం నుంచి గట్టెక్కే మార్గం కనిపించకపోవడంతో ఖతార్, తమ ప్రజలు నివాసితులపై ఉక్కుపాదం మోపుతోందన్న విమర్శలు వినవస్తున్నాయి. ఖతార్ తీవ్రవాదానికి వెన్నుదన్నుగా నిలుస్తోందంటూ, ఖతార్‌తో సంబంధాల్ని పలు దేశాలు తెగతెంపులు చేసుకున్న దరిమిలా ఖతార్‌లో పరిస్థితులు కొంత ఆందోళనకంగా మారాయి. అయితే ఖతార్ మాత్రం తమ దేశంలో పౌరులు, నివాసితులు ఎవరూ ఆందోళన చెందే పరిస్థితులు లేవనీ, తమ ఆర్థిక వ్యవస్థ అత్యంత పరిపుష్టంగా ఉందని చెబుతోంది. ఎవరెంతలా తమతో సంబంధాలు తెంచేసుకున్నా ఏళ్ళ తరబడి ధైర్యంగా మనుగడ సాధించే శక్తి ఉందన్నది ఖతార్ వాదన. కానీ పరిశీలకుల వాదన ఇంకోలా ఉంది. ఖతార్ ప్రభుత్వంలో ఆందోళన పెరిగిందనీ, అభద్రతాభావంతోనే పౌరులకు సెలవుల్ని రద్దు చేసిందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్‌తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ
- లోక్ భవన్లో ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ & డామన్ మరియు డయ్యూ ఆవిర్భావ దినోత్సవం
- వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
- స్పేస్‌కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!







