షార్జాలో తగ్గిన రోడ్డు ప్రమాదాలు
- July 02, 2017
షార్జాలో ఈ ఏడాది తొలి అర్థ భాగంలో రోడ్డు ప్రమాదాలు కొంతవరకు తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది ఇదే సమయానికి 69 మరణాలు రోడ్డు ప్రమాదాల కారణంగా జరిగితే, ఈ ఏడాది ఆ సంఖ్య 60 గా నమోదయ్యింది. రోడ్ సేఫ్టీకి సంబంధించి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని అధికారులు తెలిపారు. అయినప్పటికీ కూడా రహదారి భద్రతపై మరింత అవగాహన అవసరమని వారు చెప్పారు. షార్జా పోలీస్, డైరెక్టర్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్ డిపార్ట్‌మెంట్ మేజర్ జనరల్ అలై అల్ నక్బి మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల్ని నివారించేందుకు అత్యంత వ్యూహాత్మకంగా పలు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. డిపార్ట్‌మెంట్ పరంగా ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ, వాహనదారుల్లో చైతన్యమే రోడ్డు ప్రమాదాలను తగ్గిస్తుందని, ఆ కారనంగానే అవగాహన కార్యక్రమాల్ని విస్తృతంగా చేపడుతున్నామని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్‌తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ
- లోక్ భవన్లో ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ & డామన్ మరియు డయ్యూ ఆవిర్భావ దినోత్సవం
- వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
- స్పేస్‌కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!







