ట్రావెల్‌ బ్యాన్‌ ఉల్లంఘన కేసు విచారణ వాయిదా

- July 03, 2017 , by Maagulf
ట్రావెల్‌ బ్యాన్‌ ఉల్లంఘన కేసు విచారణ వాయిదా

మనామా: ఓ బహ్రెయినీ వ్యక్తి, వేరొకరి ఐడీ కార్డుతో పట్టుబడిన కేసుకు సంబంధించి విచారణను హై క్రిమినల్‌ కోర్టు వాయిదా వేసింది. సోదరుడి ఐడీ కార్డ్‌తో కింగ్‌ ఫహాద్‌ కాజ్‌వేపై సదరు వ్యక్తి పట్టుబడటంతో, అతనిపై ట్రావెల్‌ బ్యాన్‌ విధించారు. అయితే, ఈ కేసు విచారణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, ట్రాఫిక్‌ సమస్యల కారణంగా చిన్న పొరపాటు జరిగింది తప్ప, కావాలని చేసిన తప్పిదం కాదని, తన సోదరుడు తాను ఒకేలా ఉంటాం గనుక చిన్నపాటి కన్‌ఫ్యూజన్‌ చోటుచేసుకుందని వివరణ ఇచ్చారు. అయితే ఉద్దేశ్యపూర్వకంగానే నిందితుడు, తన సోదరుడి ఐడీ కార్డ్‌ని ఉపయోగించారని అభియోగాలు మోపబడ్డాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com