ఇజ్రాయెల్ చేరుకున్నమోదీ
- July 04, 2017
టెల్అవివ్: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇజ్రాయెల్ చేరుకున్నారు. బెన్ గురియన్ విమానాశ్రయంలో ఆయన రాక సందర్భంగా ప్రత్యేక ఆహ్వాన ఏర్పాట్లు చేశారు. ఎర్రతివాచీ పరిచి మోదీకి సాదర స్వాగతం పలికారు. ఆ దేశ అధ్యక్షుడు బెంజమిన్ నేతన్యాహు ప్రధాని మోదీకి స్వాగతం పలికి ఆహ్వానించారు. క్రైస్తవ మత ప్రధాన గురువు పోప్, అమెరికా దేశాధ్యక్షుడికి మాత్రమే దక్కే ప్రత్యేకమైన స్వాగతం అందుకున్న తదుపరి వ్యక్తి మోదీ కావడం విశేషం. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఏర్పాటు చేసే ప్రత్యేక ఆహ్వాన కార్యక్రమంలో ఇరు దేశాధ్యక్షులూ మీడియాతో మాట్లాడనున్నారు. మోదీ రాక సందర్భంగా నేతన్యాహు ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఇజ్రాయెలీ పౌరులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. 'భారత ప్రధాని రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ పర్యటన ఇరు దేశాలకు మేలు చేకూరుస్తుంది'.. అని వారు అభిప్రాయపడుతున్నారు.
భారత్, ఇజ్రాయెల్ మధ్య దౌత్య సంబంధాలు మొదలై 25ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన చేపట్టారు. కీలక, వ్యూహాత్మక రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడం ఆయన పర్యాటక ప్రధాన ఉద్దేశం.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







