కళ్యాణ్ రామ్ 'ఎంఎల్ ఏ' గా వచ్చేసాడు..

- July 04, 2017 , by Maagulf
కళ్యాణ్ రామ్ 'ఎంఎల్ ఏ' గా వచ్చేసాడు..

నందమూరి కళ్యాణ్ రామ్, కాజల్ జంటగా నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఎంఎల్ ఏ (మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి). ఈ చిత్రం ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకోగా, రెండో షెడ్యూల్ రీసెంట్ గా హైదరాబాద్ లో జరుపుకుంటుంది. తాజాగా ఈ మూవీ కి సంబదించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసారు.
రెండు రోజుల క్రితమే కాజల్ చిత్ర యూనిట్ తో కలవగా, ప్రధాన పాత్రలపై కీలక సన్నివేశాలు తెరకెక్కస్తున్నారు. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఈ ఏడాది చివరిలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని భరత్ చౌదరి మరియు కిరణ్ కుమార్ రెడ్డి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com