ఎన్.టి.ఆర్. ట్రస్ట్ వారిచే ప్రత్యేక కోర్సు ప్రారంభం

- July 04, 2017 , by Maagulf

హైదరాబాద్: స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని భావించే మహిళల కోసం ఎన్.టి.ఆర్. ట్రస్ట్ ఒక ప్రత్యేక కోర్సును ప్రారంభించనుంది. మహిళల కోసం ప్రత్యేకంగా అసిస్టెంట్ కుక్ కోర్సు ద్వారా స్వీట్స్, చైనీస్, బ్రేక్-ఫాస్ట్, రెస్టారెంట్ & బేకరీ ఐటమ్స్ తయారు చేయడంలో అనుభవజ్ఞులైన ట్రైనర్లతో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా గృహిణిగా ఆదాయమార్గాలు అన్వేషిస్తున్న వారికి, ఇంటివద్దే వంటకాలు తయారుచేసి మార్కెట్ కు సరఫరా చేయాలనుకున్న వారికి ఇది చక్కని అవకాశం. కోర్సు ఫీజు భరించలేని వారికోసం ఉచితంగా ఈ శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తి కలిగిన అర్హులైన వారికి ప్రవేశం, రిజిస్ట్రేషన్ మరియు శిక్షణ పూర్తిగా ఉచితం. ఆసక్తి గల మహిళలు బంజారాహిల్స్, రోడ్ నెం.2 లోని ఎన్.టి.ఆర్. ట్రస్ట్ ని సంప్రదించవచ్చు లేదా 040-30145800, 9100433446 నెంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com