కిటికి ఆవలి జంబో నేరేడు

కిటికి ఆవలి జంబో నేరేడు

మా యిరువురి

మధ్యన వుండేది
అద్దాల కిటికి
దాని ఆకుల తివాచి
---
పలకరింపు
అద్దం నుండి
ఒకరి చూపుల్లోని పరిమళం
మరొకరి  పెదవుల పైన వికసించే నవ్వు
------
కరచాలనం
ఆకుల సవ్వడి
-------
మా మధ్యన తేడాలేమీ లేవు
కిటికీలు తెరిచి
గాలాకాశంలా
తెరుచుకునే  తీరిక తప్ప!

--సత్య శ్రీనివాస్ 

Back to Top