పెట్రోల్ బిల్లు చెల్లించమని అడిగినందుకు భారతీయుని ప్రాణాలు తీశారు
- July 06, 2017
అరాచకంకు అంతే లేకుండా పోతుంది..బతుకు తెరువు కోసం పొట్ట చేత్తో పట్టుకొచ్చిన సామాన్యులపై సైతం దౌర్జన్యకారులు విరుచుకుపడుతున్నారు. . నాలుగు రోజుల క్రితం పెట్రోల్ పోయిం చుకునేందుకు బంక్‌కు వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు డబ్బులు ఇవ్వకుండా వెళ్లేందుకు ప్రయత్నిం చగా ఖాజా మొయినుద్దీన్ (37) అడ్డుకు న్నాడు. దీంతో వారు ఖాజాపై దాడిచేశారు. గాయపడిన అతడిని అక్కడి ఆస్పత్రిలో చేర్పించారు. నాలుగురోజులు మృత్యువుతో పోరాడి సోమ వారం చనిపోయినట్లు అక్కడే ఉన్న ఖాజా అన్న ఫహీమ్, మామా రియాజ్ తెలంగాణా రాష్ట్రంలో జగిత్యాల జిల్లాలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.ఒక గ్యాస్ స్టేషన్ వద్ద ఒక భారతీయుడు కార్ల ఇంధన ట్యాంక్ నింపిన తర్వాత 20 సౌదీ రియళ్ళ బిల్లు చెల్లించమని కోరాడు. దాంతో ఆగ్రహించిన గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఖాజామొయిద్దీన్ ఆటో నడిపే ఖాజా పిల్లల చదువులు.. ఆరోగ్య సమస్యల కారణంగా రూ.3లక్షలకుపైగా అప్పు చేశా డు. ఇల్లు అమ్మినా అప్పులు తీరకపోవడం తో మరో రూ.3.5 లక్షలు అప్పు చేసి సౌదీకి వెళ్లాడు. ఏడాది క్రితం సౌదీకి వెళ్లిన ఖాజా అక్కడ పని దొరకక ఇబ్బందులు పడ్డాడు. 20 రోజుల క్రిత మే జెద్దాలోని ఓ పెట్రోల్ బంక్‌లో పనికి కుదిరా డు. కుటుంబ సభ్యుల ప్రకారం ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తరువాత గాయపడిన ఖాయిజుద్ధీన్ మరణించాడు. భర్త మరణవార్త వినగానే ఖాజా భార్య తహమీనాబేగం షాక్‌తో స్పృహతప్పింది. వీరికి పిల్లలు షారియా, అస్నా, మోహిద్ ఉన్నారు.
తాజా వార్తలు
- ఫార్ములా 1 రేస్.. జెడ్డా, మక్కా, తైఫ్‌లో స్కూళ్లకు సెలవులు..!!
- యూఏఈలో 18 క్యారెట్ల గోల్డ్ జ్యువెలరీకి ఫుల్ డిమాండ్..!!
- బహ్రెయిన్ మంత్రితో సమావేశమైన భారత రాయబారి..!!
- రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం.. దౌత్య ప్రయత్నాలను స్వాగతించిన ఖతార్..!!
- 919 దిగుమతి చేసుకున్న మద్యం సీసాలు.. నలుగురు అరెస్టు..!!
- అల్ దఖిలియాకు పోటెత్తిన టూరిస్టుల..పర్యాటక ప్రదేశాల్లో రద్దీ..!!
- హైదరాబాద్ విమానాశ్రయం నుండి వియెట్నాం, హో చి మిన్కు విమాన సేవలు ప్రారంభం
- తెలంగాణలో మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ సెంటర్.. !
- ఏపీ: విశాఖ, విజయవాడ మెట్రోకు కేంద్రం నిధులు విడుదల !
- స్విస్ ఓపెన్: శ్రీకాంత్ శుభారంభం..