కూలిన శిక్షణ హెలికాప్టర్.. పైలట్లు సురక్షితం
- July 06, 2017
భారత వైమానిక దళానికి చెందిన ఓ శిక్షణ హెలికాప్టర్ గురువారం రాజస్థాన్‌లో కుప్పకూలింది. అయితే అదృష్టవశాత్తు అందులోని పైలట్లు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు.
ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన మైజీ-23 శిక్షణ హెలికాప్టర్ గురువారం ఉదయం జోధ్‌పూర్ జిల్లాలోని బాలేసర్ ప్రాంతంలో ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్, కో-పైలట్ సురక్షితంగా బయటపడినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే హెలికాప్టర్ ఎలా కూలిందన్న దానిపై దర్యాప్తుకు ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గత రెండు రోజుల్లో ఇది రెండో ఘటన కావడం గమనార్హం. వైమానిక దళానికి చెందిన ఓ హెలికాప్టర్ మంగళవారం నుంచి కనబడకుండా పోయింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని పపుమ్పరే జిల్లాలో గల సగలీకు సమీపాన ప్రయాణం ఆరంభించిన కొద్ది సమయానికే హెలికాప్టర్ నుంచి సంకేతాలు అందకుండా పోయాయి. ఇందులో ముగ్గురు సిబ్బంది ఉన్నారు. కాగా..
ఈ విమానానికి సంబంధించిన శకలాలను న్యోర్చు నదీ ప్రాంతంలో గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరు సిబ్బంది మృతదేహాలను గుర్తించగా.. మరో సిబ్బంది మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









