మద్యం తాగి వాహనం నడిపిన మహిళ : నెల జైలు శిక్ష జరిమానా
- July 06, 2017
మనామా: ' మహిళ ఆకాశంలో సగం కావచ్చు గానీ ...ఆల్కాహాల్ లో మాత్రం ఫుల్ కాకూడదు.' గల్ఫ్ దేశాల సమాఖ్య కు చెందిన ఓ మహిళ తాగడమే కాక అడ్డగోలుగా డ్రైవింగ్ చేసిన నేరానికి ఒక నెల జైలు శిక్ష మరియు1000 బిడీ ల జరిమానాతో పాటు. జైలు శిక్ష పూర్తయిన తర్వాత ఆమెకు దేశ బహిష్కరణ విధించారు.కోర్టులో నమోదు కాబడిన వివరాల ప్రకారం, జుఫెయిర్ లో పోలీసు అధికారులచే ఒక కారు గుర్తించబడింది, పోలీసులు వాహనాన్ని సమీపిస్తుండగా,ప్రయాణీకుల సీటు నుండి డ్రైవింగ్ సీట్లోకి ఒక్క ఉదుటన ఒక మహిళ కూర్చొని కారును వేగంగా నడిపి కొంత దూరం వెళ్లిన తర్వాత ఇసుక ప్రాంతానికి తీసుకెళ్లి ఆపివేసింది. ఆ మహిళ తాగి ఉన్నట్లుగా పోలీసులు కనుగొన్నారు. " నేను కారు డ్రైవింగ్ చేయడం లేదు నేను ప్రయాణీకుల సీట్లో కూర్చొని ఉన్నా...కేవలం పోలీసులు వచ్చిన తర్వాతే, నేను డ్రైవింగ్ సీట్లోనికి మారి కారు నడిపేనని ఆమె న్యాయవాదులతో చెప్పారు. ఆమె మద్యం ప్రభావానికి గురైన సమయంలో రోడ్డు నడి మధ్యలో పార్కింగ్ చేయడం... మద్యం సేవించి వాహనం నడపడం.. పోలీసు అధికారులతో వాదనకు దిగడం తదితర కేసుల్లో ఆమెపై నేరారోపణలు రుజువు కాబడి శిక్షకు అర్హురాలయింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు









