మోడల్ మృతికేసులో బంగాలీ నటుడి అరెస్టు

- July 07, 2017 , by Maagulf
మోడల్ మృతికేసులో  బంగాలీ నటుడి అరెస్టు

ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మోడల్, యాంకర్ సోనికా చౌహన్ కేసులో ప్రముఖ బంగాలీ నటుడు విక్రమ్ ఛటర్జీ అరెస్టయ్యారు. ఈ కేసులో దోషపూరిత హత్య అభియోగాలు ఎదుర్కొంటున్న విక్రమ్ ఛటర్జీని పోలీసులు శుక్రవారం ఉదయం కోల్కతాలో అదుపులోకి తీసుకున్నారు.
ఏప్రిల్ 29 తెల్లవారుజామున సోనికా.. విక్రమ్తో కలిసి కారులో వెళ్తుండగా.. రోడ్డుప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో సోనికా అక్కడికక్కడే చనిపోగా.. విక్రమ్ గాయపడ్డారు. అతివేగం, మద్యం సేవించి ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఘటన సమయంలో తాను ఎలాంటి మద్యం సేవించలేదని తొలుత విక్రమ్ ఛటర్జీ చెప్పుకుంటూ వచ్చినా.. ఆ తర్వాత పోలీసుల కస్టడీలో అసలు నిజం ఒప్పుకున్నారు. దీంతో అతడిపై దోషపూరిత హత్య కేసు నమోదు చేశారు.కాగా.. సరైన సాక్ష్యాధారాలు ఉండటంతో విక్రమ్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com