విడుదలకు రెడీ అయిన 'రా.రా...'
- July 07, 2017
తెలుగు ఇండస్ట్రీలో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ అంచెలంచెలుగా ఎదుగుతూ హీరోగా మారారు. తెలుగు ఇండస్ట్రీలో మంచి ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన సహనటి ఊహను ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీకాంత్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో పైకి వచ్చారు. గత కొంత కాలంగా హీరో గా కాకుండా సహనటుడిగా నటిస్తున్నాడు. తాజాగా శ్రీకాంత్ హీరోగా హర్రర్, కామెడీ కాన్సెప్ట్ తో కూడుకున్న చిత్రం 'రా..రా' త్వరలో విడుదల కాబోతోంది. శ్రీకాంత్ హీరో గా,నాజియా నాయికగా నటిస్తున్న చిత్రమిది. విజి చెర్రీస్ విజన్స్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకుని అభిమాను ముందుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు.
ఈ చిత్రానికి సంబంధించిన ఒక గీతాన్ని రేడియో మిర్చి కార్యాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్ తో పాటు చిత్ర సంగీత దర్శకుడు రాప్ రాప్ షకీల్, నిర్మాత విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ గీతాన్ని భాషాశ్రీ రచించగా సంగీత దర్శకునితో పాటు గాయని శ్రావణ భార్గవి ఆలపించారు.ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ..' ఇది హాస్యం తో కూడిన హర్రర్ ధ్రిల్లర్ చిత్రం.
ఈ గీతానికి శ్రోతలనుంచి మంచి స్పందన లభించటం ఎంతో ఆనందంగా ఉందని హీరో శ్రీకాంత్ తెలిపారు. సినిమా గురించి శ్రోతలతో మాట్లాడటం ఆనందం కలిగించిందన్నారు. మనుషులకు, దెయ్యాలకు మధ్య సాగే సరదా ఆటలు సగ టు సినిమా ప్రేక్షకుడిని వినోదాల తీరంలో విహరింప చేస్తాయి. హర్రర్ కామెడీ ధ్రిల్లర్ చిత్రం నేను తొలిసారి చేస్తున్నాను. 'రా..రా 'చిత్రం ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటుదని ఆశిస్తున్నాను అన్నారు.
శ్రీకాంత్ హీరోగా, నాజియా కథానాయికగా 'విజి చరిష్ విజన్స్' పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో గిరిబాబు,సీత, నారాయణ,ఆలీ,రఘుబాబు,పోసానికృష్ణ మురళి, పృథ్వి,జీవ,చంద్రకాంత్, అదుర్స్ రఘు,హేమ, షకలక శంకర్, నల్లవేణు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: రాప్ రాక్ షకీల్, ఫోటోగ్రఫి: పూర్ణ, పోరాటాలు: గిల్లె శేఖర్, ఎడిటర్: శంకర్,సమర్పణ: శ్రీమిత్ర చౌదరి
నిర్మాత: విజయ్ దర్శకత్వం: విజి చరిష్ యూనిట్.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







