నేను రెబెల్ : చేతన్

- July 08, 2017 , by Maagulf
నేను రెబెల్ : చేతన్

''స్వతహాగా నేను విశాఖ అబ్బాయిని కాబట్టి తెలంగాణ అబ్బాయి పాత్ర పోషణ కొంచెం క్లిష్టమైనదే. తెలంగాణ యాస కోసం శ్రమించాను. కథ ఎక్కడ నడుస్తుందో, అక్కడికే వెళ్లి షూటింగ్‌ చేయడం నాకు బాగా ఉపకరించింది'' అని చెప్పారు. చేతన్‌ మద్దినేని. సునీల్‌కుమార్‌రెడ్డి రూపొందించిన 'గల్ఫ్‌' చిత్రంలో ఆయన కథానాయకుడిగా నటించారు. శ్రావ్య ఫిలిమ్స్‌ పతాకంపై యక్కలి రవీంద్రబాబు, యం. రామ్‌కుమార్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ''ఇంట్లో గొడవపెట్టి గల్ఫ్‌కు వెళ్తాను. అక్కడ గోదావరి ప్రాంతం నుంచి వచ్చిన అమ్మాయితో ప్రేమలో పడతా. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి గల్ఫ్‌కు వలస వెళ్లిన వారికి నా పాత్ర ప్రతినిథిగా కనిపిస్తుంది. రెబల్‌గా ఉంటాను'' అని చెప్పారు చేతన్‌. శివ పాత్రలో ఇమిడిపోవడం కోసం సిరిసిల్లలో అక్కడి చేనేత కార్మిక కుటుంబాలు ఎలా ఉంటాయో, అక్కడివాళ్ల ఆచార వ్యవహారాలేమిటో, వాళ్లు మాట్లాడే, ప్రవర్తించే తీరు ఎలా ఉంటుందో ఆయన పరిశీలించారు. ''సునీల్‌కుమార్‌రెడ్డిగారి సినిమాలన్నీ వాస్తవిక కథాంశాలతో ఆకట్టుకుంటాయి. 'ఒక రొమాంటిక్‌ క్రైమ్‌ కథ' చూసి, ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం వస్తే బాగుంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com