ఉగ్రవాదం పై పోరుకు మేము సిద్ధం : మహ్మద్ అబ్బాస్
- July 08, 2017
ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించేందుకు తమ వైపు నుంచి పూర్తి మద్దతు ఉంటుందని పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ అన్నారు. అరబ్ దేశాలతోపాటు అంతర్జాతీయ సమాజానికి ఈ విషయంలో తాము సహకరిస్తామని చెప్పారు. అరబ్ లీగ్ ప్రధాన కార్యదర్శి అహ్మద్ అబౌల్ గెయిట్‌తో కైరోలో శనివారం సమావేశం అయిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు అక్కడి ఎంఈఎన్ఏ అనే వార్తా సంస్థ తెలిపింది. ఈ సమావేశం తర్వాత ఆయన ఈజిప్టు విదేశాంగ మంత్రి సామేశ్ షౌక్రీతో కూడా భేటీ అయ్యారని ఆయనతో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు వెల్లడించింది.
'తీవ్రవాదం, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని నిర్మూలించేందుకు ప్రయత్నం చేస్తున్న శక్తుల్లో పాలస్తీనా కూడా ఒక భాగం' అని అబ్బాస్ అన్నారు. అదే సమయంలో తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు గత పాలకులు చేసిన ప్రయత్నాలను, తాము చేస్తున్న కృషిని ప్రస్తావించారు. ఇజ్రాయెల్ ఆక్రమణ చర్యలను నిలువరించగలిగామని, పాలస్తీనా పౌరుల హక్కుల స్థాపన జరిగిందని దీంతో ప్రస్తుతం జెరూసలెం, హెబ్రాన్ వంటి నగరాలను ప్రపంచ హెరిటేజ్ జాబితాలో యూనెస్కో చేర్చిందని వారికి గుర్తు చేశారు. ఉగ్రవాదం నిర్మూలించే విషయంలో తాము ఎప్పుడూ ముందుంటామని, తమకు ముందునుంచి అండగా నిలుస్తున్న ఈజిప్టుకు ధన్యవాదాలని తెలిపారు.
తాజా వార్తలు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!







