హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న ప్రియదర్శన్ కూతురు

- July 09, 2017 , by Maagulf
హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న ప్రియదర్శన్ కూతురు

సినిమా ఇండస్ట్రీలో ఈమద్య వారసత్వపు హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అప్పటి హీరో, హీరోయిన్ల వారసులు ఎంట్రీ ఇస్తూ తమ సత్తా చాటుతున్నారు. అయితే ఇందులో కొంతమందికి కలిసి వస్తుంటే..మరికొంత మందికి కలిసి రావడం లేదు. తాజాగా 90వ దశకంలో కొన్ని సినిమాల్లో వచ్చినా మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది లిజి. ఆ తర్వాత మళియాళ దర్శకుడు ప్రియదర్శన్ ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ఇక మళియాళంలో సత్తా చాటిన ప్రియదర్శన్ ఆ తర్వాత కాలంలో బాలీవుడ్ లో సైతం సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు . వీరికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. తాజాగా లిజి కూతురు కళ్యాణి కూడా సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. తల్లి శిక్షణలో హీరోయిన్ గా మెలుకువలు నేర్చుకుంటున్న ఈ అమ్మడు మరి హీరోయిన్ గా ఎలా రాణిస్తుందో చూడాలి. అయితే లిజి ప్రియదర్శన్ నుండి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే . వాస్తవానికి తండ్రి వారసత్వంతో మొదట దర్శకత్వం ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణి ఇప్పుడు హీరోయిన్ గా మారబోతుంది.
మనం వంటి క్లాసికల్ చిత్రాన్ని అందించిన విక్రమ్ కుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తోంది కళ్యాణి . అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ రెండవ చిత్రం లో కోసం చాలామంది ని వెదికారు కానీ ఎవరూ సెట్ కాలేదు దాంతో కళ్యాణి ని హీరోయిన్ గా ఫిక్స్ చేశారట . ఇంకేముంది తండ్రి లాగే దర్శకత్వ శాఖలో పని చేసిన కళ్యాణి ఇప్పుడు తల్లి లాగ హీరోయిన్ అయ్యింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com