భారతీయ ప్రయాణికులకు అమెరికా ప్రయాణం ఇక సులభతరం
- July 09, 2017
ఎట్టకేలకు భారతీయ ప్రయాణికులకు అమెరికా కాస్త వెసులుబాటు నిచ్చింది. ఇతర దేశాల పౌరులు ఎక్కువ తనిఖీలు లేకుండా తేలికగా అమెరికాలో అడుగుబపెట్టడానికి అనుమతించే 'గ్లోబల్ ఎంట్రీ' అర్హతను భారతీయులకు కూడా కల్పిస్తున్నట్టు అమెరికా ఇటీవల ప్రకటించింది. ముందే అనుమతి పొందిన, ముప్పు కలిగించే అవకాశం లేని ప్రయాణికులు సులువుగా అమెరికాలో ప్రవేశించడానికి వీలుగా కస్టమ్స్, సరిహద్దు రక్షణ విభాగం (సీబీపీ) గ్లోబల్ ఎంట్రీని గతంలో రూపొందించింది. ప్రస్తుతం 53 అమెరికా విమానాశ్రయాల్లో ఈ గ్లోబల్ ఎంట్రీ ఆటోమేటెడ్ కియోస్క్‌లు పనిచేస్తున్నాయి. భారత్‌కు సులభ ప్రవేశం కల్గించిన అమెరికా పాక్‌ను, చైనాను రష్యాను కూడా పక్కన బెట్టడం గమనార్హం.
అమెరికా హోం లాండ్ సెక్యూరిటీ శాఖలో భాగమైన సీబీపీ తాజా నిర్ణయం ఫలితంగా ఇక నుంచి భారతీయులు గ్లోబల్ ఎంట్రీ సౌకర్యం కోసం గ్లోబల్ ఆన్లైన్ ఎన్రోల్మెంట్ సిస్టం(గోస్) వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. తాజా నిర్ణయంతో గ్లోబల్ ఎంట్రీ అవకాశం లభించిన పదకొండో దేశంగా భారత్ ఆవిర్భవించింది. అమెరికాలో భారత రాయబారిగా ఉన్న నవతేజ్‌సింగ్ సర్నా ఈ విధానంలో పేరు నమోదు చేయించుకున్న తొలి భారతీయుడయ్యారు. ఇప్పటికే అమెరికాతోపాటు 10 ఇతర దేశాలకు చెందిన 40 లక్షల మంది గ్లోబల్ ఎంట్రీ సభ్యులుగా చేరారు. అమెరికా విమానాశ్రయాల్లో వారు సంప్రదాయ సీపీబీ తనిఖీ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు. ప్రత్యేక ఆటోమేటెడ్ కియోస్క్(గది)కు వెళ్లి తమ గుర్తింపు కార్డులను నిమిషాల్లో తనిఖీ చేయించుకుని అమెరికా నగరాల్లోకి ప్రవేశించవచ్చు.
గ్లోబల్ ఎంట్రీ సభ్యులు అమెరికా రవాణా భద్రత విభాగం అందించే ప్రత్యేక స్క్రీనింగ్ సౌకర్యం కూడా పొందవచ్చు. అమెరికాతో సన్నిహిత సంబంధాలున్న అర్జెంటీనా, కొలంబియా, జర్మనీ, మెక్సికో, నెదర్లాండ్స్, పనామా, దక్షిణ కొరియా, సింగపూర్, స్విట్జర్లాండ్, బ్రిటన్ దేశాల పౌరులకు ఇప్పటికే గ్లోబల్ ఎంట్రీ అర్హతకు అనుమతి ఇచ్చారు. తాజాగా భారత్ ఈ జాబితాలో చేరింది. 11 దేశాలతోపాటు అమెరికా పౌరులు, జాతీయులు, చట్టబద్ధమైన శాశ్వత వాసులు కూడా గ్లోబల్ ఎంట్రీలో సభ్యత్వం తీసుకోవడానికి అర్హులే. అలాగే, నెక్సస్ ప్రోగ్రాంలో నమోదైన కెనడా పౌరులు, నివాసులు కూడా గ్లోబల్ ఎంట్రీకి దరఖాస్తుచేసుకోవచ్చు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







