బ్రిటన్ రాజధానిలండన్లో మరోసారి భారీ అగ్నిప్రమాదం
- July 09, 2017
బ్రిటన్ రాజధానిలండన్లోని క్యామ్డెన్ లాక్ మార్కెట్లో ఆదివారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న 70 మంది అగ్నిమాపక సిబ్బంది, పది అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఓ భవనంలోని మూడు అంతస్థుల్లో మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. క్యామ్డెన్ మార్కెట్ ఉత్తర లండన్లోనే ప్రముఖ పర్యాటక స్థలంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. సమయానికి మంటలు అదుపు చేయడంతో పెనుప్రమాదం తప్పిందని.. ఆలస్యమైతే పక్కనున్న రెస్టారెంట్లకు కూడా మంటలు వ్యాపించేవని చెప్పారు. జూన్లో వెస్ట్ లండన్లోని గ్రెన్ఫెల్ టవర్లో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!







