ఇద్దరు జవాన్లు మృతి పాకిస్తాన్‌లో పేలుడు

- July 10, 2017 , by Maagulf
ఇద్దరు జవాన్లు మృతి పాకిస్తాన్‌లో పేలుడు

పాకిస్తాన్‌లో పేలుడు సంభవించి ఇద్దరు రక్షణ సిబ్బంది మృతిచెందారు. వాయువ్య పాకిస్తాన్‌లో అఫ్గానిస్తాన్‌ సరిహద్దు ఖుర్రం ఏజెన్సీలో చెక్‌పోస్టు వద్ద సోమవారం ఈ సంఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఓ రిజర్వాయర్‌ నుంచి రక్షణ సిబ్బంది నీటిని తీసుకొస్తుండగా ఐఈడీ బాంబు పేలింది. ఈ ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు.
భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఈ పేలుడుకు తామే బాధ్యత వహిస్తున్నట్టు ఇంతవరకు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించలేదు. నిందితులను పట్టుకునేందుకు రక్షణ సిబ్బంది రంగంలోకి దిగారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com