హీరోయిన్ తాప్సికి కౌంటర్ ఇచ్చిన సిరాశ్రీ

- July 11, 2017 , by Maagulf
హీరోయిన్ తాప్సికి కౌంటర్ ఇచ్చిన సిరాశ్రీ

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుపైనే సెటైర్లు వేసింది తాప్సి. తన బొడ్డుపై కొబ్బరికాయ ఎలా విసిరారో.. కథలు కథలుగా బాలీవడ్ మీడియాకు చెప్పింది. ఝుమ్మంది నాదం' సినిమా షూటింగులో రాఘవేంద్రరావు సినిమాపై కాకుండా తన బొడ్డుపై కొబ్బరికాయ, పూలు విసరడం మీదే దృష్టిపెట్టాడు అంటూ ఓపెన్ కామెంట్ చేసింది.
తాప్సి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తాప్సి కామెంట్స్ పై టాలీవుడ్ నుండి రచయిత సిరాశ్రీ స్పదించారు. తాప్సీ వ్యాఖ్యలతో కొందరు రాఘవేంద్రరావుగారికి అవమానం జరిగిందని, ఇది దక్షిణాది వారిపై ఉత్తరాది వారి చిన్నచూపు అని రకరకాలుగా అభిప్రాయపడ్డారు. రాఘవేంద్రరావుగారి విజ్ఞతకి, అనుభవానికి ఇటువంటి వ్యాఖ్యలను ఆయన చాలా లైట్ గా తీసుకుని నవ్వుకునే ఉంటారు. రాఘవేంద్రరావుకి సినిమాల్లో పాటల చిత్రీకరణ పరంగా ఒక ఆర్టిస్టిక్ ఇమేజ్ ఎప్పుడో వచ్చేసింది. ఎంతమంది ఎన్ని రకాలుగా కామెడీలు చేసినా ఆయన ఇమేజ్ కి ఏ మాత్రం బీటలు పడదు. కనుక మనం కంగారు పడి, తాప్సీని కంగారు పెట్టక్కర్లేదు' అని తన ఫేస్ బుక్ లో వెల్లడించారు సిరాశ్రీ. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com