సౌదీ అరేబియాలో భారీ అగ్నిప్రమాదం...
- July 12, 2017
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో బుధవారంనాడు భారీ అగ్నిప్రమాదం జరిగింది. నజ్రాన్ ప్రావిన్స్‌లోని ఓ పాత భవనంలో మంటలు చెలరేగి 11 మంది వలస కార్మికులు అగ్నికి ఆహుతయ్యారు. మృతులంతా భారత్, బంగ్లాదేశ్‌కు చెందిన వలస కార్మికులే. కిటికీలు లేని ఆ ఇంట్లో వీరంతా తలదాచుకుంటున్నారని, ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇల్లంతా వ్యాపించాయని, పొగతో ఊపిరాడక వారంతా మృత్యువాతపడ్డారని అధికారులు తెలిపారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించామని చెప్పారు. అయితే అగ్నిప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. రియాద్‌లో 90 లక్షల మంది విదేశీ కార్మికులు పనిచేస్తున్నారనీ, వీరిలో ఎక్కువ మంది దక్షిణాయాసియా నుంచి వచ్చిన వారేనని 2015లో విడుదల చేసిన అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







