వలస కార్మికుల కోసం కువైట్‌ సొసైటీ హాట్‌లైన్‌

- July 12, 2017 , by Maagulf
వలస కార్మికుల కోసం కువైట్‌ సొసైటీ హాట్‌లైన్‌

కువైట్‌: కువైట్‌ సొసైటీ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌, వలస కార్మికుల కోసం హాట్‌లైన్‌ 22215150ని ప్రారంభించింది. వలస కార్మికులకు కువైట్‌లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారంలో భాగంగా లీగల్‌ రైట్స్‌ అలాగే డ్యూటీస్‌ విషయంలో అవగాహన కల్పించేందుకు ఈ హాట్‌లైన్‌ ఉపకరిస్తుందని కువైట్‌ సొసైటీ ప్రతినిథులు తెలిపారు. అరబిక్‌, ఇంగ్లీష్‌, ఫిలిప్పినో, హిందీ మరియు ఉర్దూ భాషల్లో ఈ హాట్‌లైన్‌ అందుబాటులో ఉంటుంది. లేబర్‌ చట్టాలు, మినిస్టీరియల్‌ డెసిషన్స్‌, అలాగే లీగల్‌ ప్రొసిడ్యూర్స్‌ వంటి వాటిపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ హాట్‌లైన్‌ని ఏర్పాటు చేశారు. హాట్‌లైన్‌కి ఇప్పటికే చాలా ఫిర్యాదులు వచ్చాయి. వాటిల్లో పాస్‌పోర్ట్‌ రికవరీ, క్యాన్సిలేషన్‌, ట్రాన్స్‌పోర్ట్‌ వంటివాటితోపాటుగా ఫైనాన్షియల్‌ డ్యూస్‌ చెల్లింపు, ఫైనల్‌ క్యాన్సిలేషన్‌ ఆఫ్‌ ట్రావెల్‌ సహా పలు సమస్యలున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com