కామెరూన్‌లో ఆత్మాహుతి దాడి

- July 13, 2017 , by Maagulf
కామెరూన్‌లో  ఆత్మాహుతి దాడి

యవోండే(కామెరూన్‌): ఆఫ్రికా దేశం కామెరూన్‌లో తీవ్ర వాద సంస్థ బోకోహరామ్‌ దాడులకు తెగబడింది. నైజీరియా సరిహద్దు పట్టణమైన వజాలోని రద్దీ ప్రాంతంలో బుధవారం సాయంత్రం జరిగిన రెండు ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 14 మంది చనిపోగా మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటన నేపథ్యంలో పట్టణాన్ని పోలీసులు దిగ్బంధించారు. తీవ్రవాద సంస్థ బోకోహరామ్‌ మూలాలు ప్రధానంగా నైజీరియాలోనే ఉన్నప్పటికీ సరిహద్దుల్లో ఉన్న చాడ్‌, కామెరూన్‌, నైగర్‌ దేశాల్లో కూడా ఇటీవల ఇటువంటి ఘటనలకు పాల్పడుతోంది. ఈ ఘటనలకు భీతిల్లిన కామెరూన్‌ వాసులు దాదాపు రెండు లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు వలసవెళ్లారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com