బొబ్బర్లు బరువును పెంచవు.. ఆహారంలో చేర్చుకుంటే?

- July 13, 2017 , by Maagulf
బొబ్బర్లు బరువును పెంచవు.. ఆహారంలో చేర్చుకుంటే?


బొబ్బర్లలో మాంసకృత్తులు, కార్బొహైడ్రేడ్లు, కొవ్వు, డైటరీ పీచు పుష్కలంగా వుంటాయి. బొబ్బర్లను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎన్నో పోషకాలు అందుతాయి. ఇందులోని ప్రోటీన్లు నెమ్మదిగా జీర్ణం కావడంతో ఆకలి వేయకుండా వుంటుంది. అంతేగాకుండా బొబ్బర్లు బరువును పెంచవు.

ఇందులో ఫోలిక్ యాసిడ్ గర్భిణీ మహిళలకు మేలు చేస్తుంది. నాడీసంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. బొబ్బర్లలో ఫ్లేవనాయిడ్స్‌తో పాటు విటమిన్‌ బి1 వుండటంతో హృద్రోగాల నివారణకు దోహదపడుతుంది. బొబ్బర్లలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపించేందుకు సాయపడతాయి.
 
బొబ్బర్లలో దాగివున్న ట్రిఫ్టోఫాన్ నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. నిద్రలేమితో బాధపడేవారు బొబ్బర్లను కూరగాయలతో కలిపి సలాడ్ల రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇందులోని విటమిన్, ఎ, సీలు ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తాయి. తద్వారా క్యాన్సర్ కణాలను పెరగనీయకుండా అడ్డుకుంటాయి. ఇంకా రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. డయాబెటిస్‌ను నియంత్రిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com