భట్వాని
- July 13, 2017
కావలసినవి: బ్లాక్ సోయాబీన్ - 250 గ్రాములు, బియ్యప్పిండి - కొద్దిగా ,ఎండు మిర్చి (వేగించి) - నాలుగు, వెల్లుల్లి రెబ్బలు,(తరిగి) - ఐదు రెబ్బలు, పసుపు - ఒక టీస్పూన్, గరం మసాలా - ఒక టీస్పూన్, ఉప్పు - రుచికి సరిపడాఆవ నూనె - నాలుగు టేబుల్ స్పూన్లు
తయారీ: ఒక టేబుల్ స్పూన్ ఆవనూనెను పాన్‌లో వేసి వేడిచేయాలి. సోయాబీన్ గింజలు వేసి అవి చిటపటమనేవరకు వేగించాలి. గింజలు వేడిగా ఉండగానే వాటిని నలగ్గొట్టాలి. ఇందులో బియ్యప్పిండి కలపాలి. స్టవ్ మీద పాన్ పెట్టి మిగిలిన ఆవనూనె వేడిచేయాలి. నూనె వేడెక్కగానే వెల్లుల్లి తరుగు కాసేపు వేగించాలి. బియ్యప్పిండి, సోయాబీన్‌ల మిశ్రమాన్ని పాన్‌లో వేసి పసుపు, గరం మసాల, ఉప్పు వేసి ఉడికించాలి. వేడివేడి అన్నంతో తింటే రుచిగా ఉంటుంది. పక్కన వేగించిన ఎండుమిర్చిని నంజుకు తింటే బాగుంటుంది.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







