నజ్రాన్ ఘటనలో మృతి చెందిన 11మంది భౌతికకాయలను స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు

- July 13, 2017 , by Maagulf
నజ్రాన్ ఘటనలో మృతి చెందిన 11మంది భౌతికకాయలను స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు

సౌదీ అరేబియా దక్షిణ ప్రాంతంలోని నజ్రాన్‌ పట్టణంలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో 11 మంది భారత కార్మికులు శ్వాస ఆడక మరణించిన విషాదఘటన " మా గల్ఫ్ డాట్ కామ్ " పాఠకులకు విదితమే.ఓ నిర్మాణ సంస్థలో పని చేస్తున్నకార్మికులంతా గాఢనిద్రలో ఉండగా ఏసీ యూనిట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగింది. దీంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి గస్తీలో ఉన్న పోలీసులు..దట్టంగా పొగ ఆవరించడాన్ని గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ  అగ్ని ప్రమాదంలో పలువురు భారతీయులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు విడిచారు. బాధితులకు సాయం అందించేందుకు జెద్దా నుంచి భారత కాన్సులేటు బృందం బయలుదేరి వెళ్లింది. యెమన్‌ సరిహద్దున ఉన్న నజ్రాన్‌ పట్టణంలో 40 వేలకు పైగా మంది తెలుగు ప్రవాసీయులు ఉన్నారు.భారతీయ రాయబార కార్యాలయంలోసీనియర్ దౌత్యవేత్తల బృందం నజరాన్ అగ్ని ప్రమాదానికి గురైన కుటుంబాలకు సహాయంగా నిలిచేందుకు తమ శక్తివంచన లేకుండా పని చేస్తున్నారు, మరణించిన11 మంది భారతీయుల కుటుంబాలతో సంభాషణ జరపడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ఇండియన్ కాన్సుల్ జనరల్ మహ్మద్ నూర్ రహ్మాన్ షేక్ తెలిపారు.ఈ ఘోర ప్రమాదంలో చనిపోయిన భారతీయులలో ఉత్తరప్రదేశ్ నుంచి అయిదుగురు, కేరళ నుంచి ముగ్గురు , బీహార్, పంజాబ్ , తమిళనాడు రాష్ట్రాల నుంచి ఒకొక్కరు ఉన్నారు.  అగ్నిప్రమాదంలో గాయపడిన భారతీయులలో ఉత్తరప్రదేశ్ నుంచి నల్గురు , జార్ఖండ్ రాష్ట్రం నుంచి ఒకరు ఉన్నారు. బాధితులకు సంబంధించిన పూర్తి  వివరాలను త్వరలోనే వెలువరిస్తామని భారత రాయబార కార్యాలయ కాన్సుల్ జనరల్ అధికారి ప్రకటించారు.కొన్ని కుటుంబాలకు సంబంధించి ఇప్పటివరకూ వారితో సంప్రదించిందని, పాస్పోర్ట్ వివరాల ఆధారంగానే మిగిలినవారి వివరాలను సేకరించి వారిని సంప్రదించేందుకు అధికారులు పలు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ దుర్ఘటనపై నజ్రాన్‌ గవర్నర్‌ ప్రిన్స్‌ జాలవీ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ విచారణకు ఆదేశించారు. న్యూఢిల్లీ లో ఉన్న సీనియర్ అధికారులతో నిరంతరం అగ్నిప్రమాద బాధితుల కుటుంబాలకు తాజా సమాచారం ఎప్పటకప్పుడు తెలియచేస్తున్నట్లు ఆయన  చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com