"ఫిదా" సినిమా! కీలక పాత్రలో ప్రముఖ దర్శకుని తల్లి..
- July 13, 2017
ఆనంద్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లీడర్ లాంటి అద్భుత చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఫిదా. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. మలయాళీ బ్యూటి సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కీలకమైన పాత్రలో ఒక హిట్ దర్శకుడి తల్లి కనిపించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రకటించారు.
పెళ్లి చూపులు సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ తల్లి గీత, ఫిదా సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. గతంలో తరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన పలు షార్ట్ ఫిలింస్ లో కనిపించిన గీత, తొలిసారిగా వెండితెర మీద కనిపించనున్నారు. ఈ సినిమా తరువాత తరుణ్ తల్లి గీత అని కాదు, "గీత గారి కొడుకే తరుణ్" అని చెప్పుకుంటారంటున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల తన ఫిదా సినిమాలో ఆమె పాత్ర ప్రాముఖ్యతను వివరిస్తూ.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







