రాయల్‌ బహ్రెయిన్‌ హాస్పిటల్‌లో డయాలసిస్‌ సెంటర్‌ ప్రారంభం

- July 14, 2017 , by Maagulf
రాయల్‌ బహ్రెయిన్‌ హాస్పిటల్‌లో డయాలసిస్‌ సెంటర్‌ ప్రారంభం

రాయల్‌ బహ్రెయిన్‌ హాస్పిటల్‌ (ఆర్‌బిహెచ్‌)లో డయాలసిస్‌ కేంద్రం ప్రారంభమయ్యింది. 2017 జులై నుంచి ఈ సెంటర్‌లో రోగులకు సేవలందుతున్నాయి. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ దీన్ని నిర్వహిస్తోంది. 2 బెడెడ్‌ ఫెసిలిటీలో హిమోడయాలసిస్‌ సేవలు అందుతున్నాయి. ఆర్‌బిహెచ్‌ కన్సల్టెంట్‌ నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ నదెర్‌ అల్బర్ట్‌ హన్నా ఈ కేంద్రానికి నేతృత్వం వహిస్తున్నారు. కైరోలోని ఇంటర్నల్‌ మెడిసిన్‌లో డాక్టర్‌ నదెర్‌ డాక్టరేట్‌ డిగ్రీ పొంది ఉన్నారు. ఈజిపిస్టన్‌ సొసైటీ ఆఫ్‌ నెఫ్రాలజీ మరియు రాయల్‌ కాలేజ్‌ ఆప్‌ సర్జన్స్‌ - ఐర్లాండ్‌లో సభ్యుడిగా పనిచేస్తున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఈ డయాలసిస్‌ సెంటర్‌ ఎంతో ఉపకరిస్తుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. డయాబెటిస్‌, హై బ్లడ్‌ ప్రెజర్‌ కారణంగా కిడ్నీ సమస్యలు తీవ్రతరమవుతాయని వైద్యులు చెబుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com