మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయి పల్లవి
- July 16, 2017
మలయాళ సినిమా ప్రేమమ్ తో సౌత్ ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించిన బ్యూటీ సాయి పల్లవి. ప్రస్తుతం ఈ భామ వరుణ్ తేజ్ సరసన ఫిదా సినిమాలో నటిస్తోంది. రిలీజ్ కు రెడీగా ఉన్న ఈ సినిమాతో పాటు అదే బ్యానర్ లో మరో రెండు సినిమాలకు ఓకె చెప్పిందట సాయి పల్లవి. ఫిదా సినిమాతో పాటు ఒకేసారి మూడు సినిమాలు చేసేలా దిల్ రాజు సాయి పల్లవితో అగ్రిమెంట్ చేసుకున్నాడు. అంతేకాదు మూడు సినిమాలకు కలిపి పేమెంట్ కూడా ఒకేసారి చేసేశాడన్న టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే ఫిదా సినిమాను పూర్తి చేసిన ఈ మలయాళ బ్యూటీ ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో నాని హీరోగా తెరకెక్కుతున్న ఎమ్ సీఏ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తరువాత కూడా దిల్ రాజు బ్యానర్ లోనే మరో సినిమా చేయనుంది. ప్రస్తుతం సతీష్ వేగ్నేష్, దశరథ్, శ్రీకాంత్ అడ్డాలలు దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేసేందుకు రెడీ ఉన్నారు. వీటిలో ఏదో ఒక సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా కనిపించనుంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







