హీరో నితిన్ కెరీర్లోనే టాప్ రేటుకు " లై " శాటిలైట్ రైట్స్
- July 16, 2017
'జయం' చిత్రంతో హీరోగా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరో నితిన్. తర్వాత వచ్చిన సినిమాల్లో దిల్ మినహా ఏవీ పెద్దగా సక్సెస్ కాలేదు. చాలా గ్యాప్ తర్వాత 'గుండె జారీ గల్లంతయ్యిందే', 'ఇష్క్' చిత్రాలు మంచి విజయం సాధించాయి. అయితే గత సంవత్సరం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అ..ఆ.' నితిన్ కెరీర్ లో ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
యంగ్ హీరో నితిన్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ లై. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇండస్ట్రీ, సినీ అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాల్లోను క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన లై టీజర్ దెబ్బతో సినిమాపై భారీ హైప్ నెలకొంది. లై టీజర్ చాలా కొత్తగా ఉండడంతో సినిమా కూడా అంతే కొత్తగా ఉంటుందన్న అంచనాలు అందరిలోను ఉన్నాయి.
ఇక ఈ సినిమా క్రేజ్ దృష్ట్యా లై శాటిలైట్ రైట్స్ అదిరిపోతోంది. ఓ ప్రముఖ ఛానెల్ లై శాటిలైట్ రైట్స్‌ను సొంతం చేసేందుకు రూ. 7 కోట్లు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఈ డీల్ ఓకే అయితే ఇది నితిన్ కెరీర్లోనే హయ్యస్ట్ శాటిలైట్ రేటుగా నిలుస్తుంది. నితిన్ సరసన మేఘా ఆకాశ్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది.
లై సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న లై ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. నితిన్ చివరి సినిమా అ..ఆ భారీ హిట్ అవ్వడంతో లై ప్రి రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోతోన్నట్టు ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









