వరల్డ్ బెస్ట్ సిటీస్: రెండో స్థానంలోకి అబుధాబి
- July 17, 2017
అబుధాబి: జీవించడానికి అత్యంత అనుకూలమైన నగరాల్లో రెండో స్థానం దక్కించుకుంది ప్రపంచ వ్యాప్తంగా అబుదాబీ సిటీ. జీవించడం, పని చేసుకోవడం, వ్యాపార సంబంధిత అంశాలు ఇలా పలు విభాగాల్లో 'అనుకూల నగరాల' ఎంపిక జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 16 నుంచి 64 ఏళ్ళలోపువారిని ఈ సర్వే కోసం ఎంపిక చేశారు. 18,000 మందికి పైగా ఈ స్వేలో పాల్గొన్నారు. 26 దేశాలకు చెందినవారిని ఇంటర్వ్యూ చేశారు. న్యూయార్క్ నగరం ఈ లిస్ట్‌లో టాప్ ప్లేస్ దక్కించుకుంది. సిడ్నీ, హాంగ్‌కాంగ్, కేప్‌టౌన్ మాస్కో, టొరంటో తదితర నగరాలకు సర్వేలో మంచి స్థానాలు దక్కాయి. 21 శాతం మంది అబుదాబీని బెస్ట్ సిటీగా ఎంపిక చేశారు. న్యూయార్క్‌తో పోల్చితే అబుదాబీకి కేవలం 2 శాతం మాత్రమే తక్కువగా ఓట్లు పడ్డాయి. అబుదాబీ టూరిజం అండ్ కల్చర్ అథారిటీ డైరెక్టర్ జనరల్ సైఫ్ సయీద్ మాట్లాడుతూ, అబుదాబీకి బెస్ట్ సిటీస్‌లో రెండో స్థానం దక్కడం ఆనందంగా ఉందని, బెస్ట్ డెస్టినేషన్‌గా అబుదాబీని తీర్చిదిద్దేందుకు ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచనలు చేసి, ఆ ఆలోచనల్ని ఆచరణ రూపంలో పెడ్తున్నామని అన్నారు. జనవరి నుంచి మే వరకు తీసుకుంటే అబుదాబీ ఎమిరేట్ 2 మిలియన్ హోటల్ గెస్ట్ అరైవల్స్‌తో తన ప్రత్యేకతను చాటుకుంది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







