ఒత్తిడిని దూరంచేసే యాలకులు.. జలుబు, దగ్గు తగ్గాలంటే
- July 17, 2017
యాలకుల్లో మెగ్నిషియం, క్యాల్షియంలతోపాటు కావలసినంత ఎలక్ట్రోలైట్లు వుంటాయి. ఇందులో పొటాషియం గుండె కొట్టుకునే వేగాన్ని క్రమబద్ధీకరిస్తుంది. తద్వారా అధికరక్తపోటు అదుపులో వుంటుంది. యాలకులని నమలడం వల్ల నోటిదుర్వాసన సమస్య అదుపులో ఉంటుంది. చిగుళ్ల సమస్యలు కూడా చాలామటుకూ తగ్గుతాయి. యాలకులతో చేసిన నూనెని పెదాలకు రాయడం వల్ల ఆరోగ్యంగా కనిపిస్తాయి. అలాగే ముఖానికి రాస్తే ఛాయ పెరుగుతుంది.
యాలకులు ఆకలిని పెంచుతాయి. ప్రతిరోజూ పడుకునే ముందు గ్లాసు గోరువెచ్చటి పాలల్లో అరచెంచా యాలకులపొడీ, పసుపూ, చక్కెరా వేసుకుని తాగడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. దగ్గు, జలుబు తగ్గించడంలో యాలకులు పవర్ ఫుల్‌గా పనిచేస్తాయి. అలాంటి సమయంలో యాలకులు తింటూ ఉంటే.. జలుబు, దగ్గు తగ్గడమే కాకుండా.. గొంతులో ఇన్ఫెక్షన్లను కూడా దూరం చేస్తుంది. యాలకులు ఒత్తిడిని తగ్గిస్తాయి.
యాలకులు వేసి మరిగించిన టీ తీసుకోవడం వల్ల వెంటనే ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యమూ మెరుగుపడుతుంది. యాలకులు తినడం వల్ల ఊపిరితిత్తుల్లో రక్తప్రసరణ మెరుగవుతుంది. తద్వారా ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యల నుంచి బయటపడవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









