సైదాబాద్‌కు చెందిన వెంకటమ్మను వీసాతో దుబాయ్ తీసుకెళ్లారు...చిత్రహింసలు పెట్టారు
- July 17, 2017
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం
నకిలీ కన్సెల్టెన్సీలతో నిరుద్యోగులకు గాలం
ఇద్దరి అరెస్టు.. పరారీలో ముగ్గురు
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయకులను మోసగిస్తున్న ఇద్దరు దళారులను సోమవారం అరెస్ట్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ బి.లింబారెడ్డి తెలిపారు. నగరంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన రాజు(46), మహ్మద్ షౌకత్ అలీ (40), నసీర్ స్నేహితులు. ముంబైకు చెందిన సలీం అక్కడే గోల్డెన్ ఎంటర్ప్రైజెస్ పేరుతో కన్సల్టెన్సీ ఏర్పాటుచేశారు. దుబాయ్, సౌది ఆరేబియా దేశాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ ప్రచారం చేసేవాడు. ముగ్గురు స్నేహితులను సలీం ఏజెంట్లుగా నియమించకున్నాడు. వారి ద్వారా హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లో ప్రచారం చేయించాడు. పాస్‌పోర్ట్, వీసా ఖర్చుల కోసమంటూ ఒక్కొకరి నుంచి రూ. 90 వేల నుంచి రూ1.20 లక్ష వరకు వసూలు చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో సైదాబాద్‌కు చెందిన వెంకటమ్మ అనే మహిళను వర్క్ వీసాతో దుబాయ్ పంపించారు. అక్కడికి వెళ్లేముందు మంచి ఉద్యోగం, వసతి ఉండే విధంగా ఉద్యోగం ఇప్పిస్తామని పంపించారని, అక్కడికి వెళ్లిన తర్వాత రోజే చిత్రహింసలు పెడుతున్నారని తన భర్తకు ఫోన్ ద్వారా ఆమె సమాచారం అందించింది. వెంకటమ్మ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నకిలీ కన్సెల్టెన్సీ బాగోతం వెలుగులోకి వచ్చింది. రాజు, షౌకత్ అలీలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి వారి వద్ద నుంచి 3 పాస్‌పోర్టులు, డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
మల్లెపల్లికి చెందిన మహ్మద్ అబ్దుల్ ఖుద్దుస్, నసీర్, ముంబాయికి చెందిన సలీమ్ పరారీలో ఉన్నట్లు డీసీపీ లింబారెడ్డి పేర్కొన్నారు. నిందితులను సైదాబాద్ పోలీసులకు అప్పగించారు. టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో ఇన్స్పెక్టర్ ఎస్.మోహన్‌కుమార్, ఎస్సైలు ఎ.సుధాకర్, కె.శ్రీనివాస్, ఎస్.సైదాబాబు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







