రాజధాని అమరావతి శంకుస్థాపనకు హెలికాప్టర్లో కేసీఆర్
- October 19, 2015
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 22వ తేదీన హెలికాప్టర్లో వెళ్లనున్నారు. తొలుత రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలనుకున్న కేసీఆర్ కు, ఆ రోజు శంకుస్థాపన రీత్యా రోడ్లు రద్దీగా ఉంటాయని అధికారులు చెప్పడంతో ఆ ప్రయత్నాన్ని మానుకుని హెలికాప్టర్లో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఐతే సూర్యాపేట వరకూ రోడ్డు మార్గంలో వస్తారని సమాచారం. అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్ ప్రయాణం చేస్తారని తెలుస్తోంది. అమరావతి రాజధాని శంకుస్థాపనకు సీఎం కేసీఆర్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా ఆహ్వానించారు. కాగా ఈ శంకుస్థాపన కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులు మీదుగా జరుగనుంది. శంకుస్థాపనకు లక్షల్లో ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇందుకుగాను అవసరమైన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమై ఉన్నారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







