జై బాలయ్య పేరిట లక్ష ఇటుకలు
- October 19, 2015
నందమూరి సింహం బాలకృష్ణ ఏమి చేసినా తన ప్రత్యేకత కనిపించే విధంగా చాలా రాజసంగా చేస్తాడు. ఇప్పుడు శంఖుస్థాపన జరుపుకోపోతున్న అమరావతి విషయంలో కూడ తన అభిమానులచేత విభిన్నమైన కార్యక్రమాన్ని నిర్వహింప చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణమౌతున్న వేళ ఒక సరికొత్త కార్యక్రమంతో బాల కృష్ణ అభిమానులు ముందుకు వచ్చారు. 'జై బాలయ్య' పేరిట లక్ష ఇటుకలు అమరావతి నిర్మాణానికి విరాళంగా ఇవ్వబోతున్నారు. పురాణ యుగంలో శ్రీరాముడు రావణాసురుడుని వధించడానికి వారధి నిర్మించినప్పుడు అప్పటి వానర సైన్యం ప్రతి రాయి పై 'జై శ్రీరామ' అని నామస్మరణ చేస్తూ వారధి నిర్మించిందని చెపుతారు. ఇప్పుడు బాలయ్య సైన్యం కూడ లక్ష ఇటుకలపై 'జై బాలయ్య' అని రాసి రాజధాని నిర్మాణంలో భాగస్వాములం అవుతున్నామని మీడియా ముందు గర్వంగా చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఇది కేవలం ప్రారంభమే అని ఇరు రాష్ట్రాలలోని బాలకృష్ణ అభిమాన సంఘాలు ఇంకా అనేక లక్షల సంఖ్యలో ఇటుకలను 'జై బాలయ్య' పేరుతో తయారు చేయించి అమరావతి నిర్మాణంలో అణువణువునా బాలయ్య పేరు ఉండేలా చేస్తామని అభిమానులు చెపుతున్నారు. అంతేకాదు అమరావతి నిర్మాణం ప్రారంభం అయిన తరువాత చాల మంది బలకృష్ణ అభిమానులు స్వచ్ఛందంగా అక్కడ కూలీలులా పనిచేసి ఒక అద్భుతమైన రాజధాని నిర్మించడంలో తమ వంతు పాత్ర నిర్వర్తిస్తామని గర్వంగా మీడియా ముందుకు వచ్చి చెపుతున్నారు. ఎన్ బి కె హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్చంద సంస్థ తరఫున ఈకార్యక్రమ ప్రారంభం విజయదసమి రోజున జరగబోతోంది. దీనిని బట్టి చూస్తుంటే బాలయ్య మాత్రమే కాదు బాలకృష్ణ అభిమానులు కూడ రాజధాని అమరావతి శంఖుస్థాపనకు ఉడతాభక్తిగా సహాయ సహకారాలుఅందిస్తున్నారు అని అనుకోవాలి..
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







