'ఝాన్సీరాణి' గా నటిస్తున్న కంగనా రనౌత్ కి గాయాలు

- July 21, 2017 , by Maagulf
'ఝాన్సీరాణి' గా నటిస్తున్న కంగనా రనౌత్ కి గాయాలు

కంగనా రనౌత్ 'మణికర్ణిక- ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ' షూటింగ్‌లో గాయపడింది. షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ కి వచ్చిన ఆమె, కత్తిఫైట్ చేస్తున్న సమయంలో నుదుటికి గాయమైనట్టు సమాచారం. వెంటనే యూనిట్ అపోలో ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఆమెకి 15 కుట్లు వేసినట్టు తెలుస్తోంది. ఐసీయూలో ట్రీట్‌మెంట్ తీసుకుంటోంది. కంగనాకు పెను ప్రమాదం తప్పిందని ఎముకకు దగ్గరగా కత్తి గుచ్చుకున్నట్లు వైద్యులు చెప్పినట్లు వెల్లడించింది యూనిట్.
క్రిష్ డైరెక్షన్‌లో 'మణికర్ణిక- ద క్వీన్ ఆప్ ఝాన్సీ' మూవీ చేస్తోంది కంగనారనౌత్. నటీనటుల ఎంపిక పూర్తికావడంతో ప్రస్తుతం యుద్ధ సన్నివేశాలపై హైదరాబాద్‌లో ట్రైనింగ్ తీసుకుంటోంది ఈ బ్యూటీ. బుధవారం సాయంత్రం కంగనా- ఆమె కో-స్టార్ నిహార్ పాండ్యల మధ్య వార్ సీన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో పొరపాటున కంగనా నుదుటికి కత్తి తగిలింది. వెంటనే రక్తం కారిపోవడంతో యూనిట్ అపోలోకి తరలించింది. ఆమె ఆరోగ్యానికి పర్వాలేదని గానీ కొద్దిరోజులు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పడంతో యూనిట్ ఊపిరి పీల్చుకుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com