సౌదీ లో సూర్యుడు కింద పని నిషేధం అమలు : నమోదైన 227 ఉల్లంఘనలు
- July 21, 2017
వేసవిలో మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుడి కింద పనిచేయడం నిషేధించారు. ఐనప్పటకే దేశవ్యాప్తంగా 227 ఉల్లంఘనలను గుర్తించినట్లు లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖలోని తనిఖీ అధికారులు వెల్లడించారు. మిట్ట మధ్యాహ్నం నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఇది కొనసాగుతుంది. జూన్ 15 వ తేదీ నుండి సెప్టెంబరు 15 వ తేదీ వరకు ఈ నిబంధన అమలుచేయబడుతుంది. తూర్పు ప్రాంతం తరువాత, రియాద్ ప్రాంతంలో అత్యధికంగా వేసవిలోమిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుడి కింద పనిచేయడం ఉద్యోగ నిషేధాన్ని నమోదు చేసింది, మంత్రిత్వశాఖ ప్రతినిధి ఖాలిద్ అబా అల్-ఖైల్ చెప్పారు. మూడునెలల పాటు మంత్రిత్వ శాఖ నిషేధం అమలును అనుసరిస్తుంది. కార్మికుల భద్రత ఏ విధంగా అమలుజరుగుతుందో పర్యవేక్షించేందుకు పలు క్షేత్ర సందర్శనలు జరుపుతున్నట్లు ఆయన చెప్పారు. మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుడి కింద పనిచేయడం అమలు చేయని యాజమాన్యాలు, సంస్థలపై ఫిర్యాదులు లేదా ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు భావిస్తే, "ఉల్లంఘించినవారిని గుర్తించడానికి మనమంతా కలిసి" అనే అనువర్తనం ద్వారా స్మార్ట్ఫోన్ల నుంచి " 19911 " కాల్ సెంటర్ కు పిర్యాదు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







