రామ్‌నాథ్ కోవింద్ కొత్త రాష్ట్రపతిగా జులై 25న ప్రమాణస్వీకారం
- July 22, 2017
భారత 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్‌నాథ్ కోవింద్ చేత జులై 25న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఖేహర్
ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఆయనకు 65 శాతానికి పైగా మెజార్టీతో ప్రతిపక్ష కూటమి అభ్యర్ధి మీరాకుమార్‌పై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం జులై 24తో ముగుస్తుంది, ఈ నేపథ్యంలో 23న పార్లమెంట్ ఉభయసభలు ప్రణబ్‌కు వీడ్కోలు సమావేశం ఏర్పాటుచేశాయి. ఇదిలా ఉండగా నూతన రాష్ట్రపతి సెక్రటరీగా పబ్లిక్ ఎంటర్‌ప్రెజెస్ సెలక్షన్ బోర్డు ఛైర్మన్ సంజ§్ు కొఠారిని నియమించారు. మీడియా కార్యదర్శిగా సీనియర్ జర్నలిస్టు అశోక్ మాలిక్‌ను నియమించారు. వీరు పదవిలో రెండేళ్లు కొనసాగుతారు.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







