కాతిఫ్ షూటౌట్లో ముగ్గురు తీవ్రవాదుల కాల్చివేత
- July 22, 2017
జెడ్డా: కాతిఫ్ గవర్నరేట్ పరిధిలోని సైహాత్ డిస్ట్రిక్ట్‌లో సెక్యూరిటీ ఫోర్సెస్ జరిపిన కాల్పుల్లో ముగ్గురు వాంటెడ్ టెర్రరిస్టులు హతమయ్యారు. ఇంటీరియర్ మినిస్ట్రీ సెక్యూరిటీ అధికార ప్రతినిథి మేజర్ జనరల్ మన్సౌర్ అల్ టుర్కి మాట్లాడుతూ, జులై 156న సెక్యూరిటీ సిబ్బంది అల్ జూర్ సమీపంలో తీవ్రవాదులు గుర్తించారనీ, తీవ్రవాదులు టయోటా కరోలా వాహనాన్ని దొంగిలించారనీ, అది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది, తీవ్రవాదుల్ని చుట్టుముట్టగా, తీవ్రవాదులు కాల్పులకు దిగారనీ, ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు చనిపోయారని తెలిపారు. చనిపోయిన ముగ్గురూ పలు కేసుల్లో దోషులని అల్ టుర్కి చెప్పారు. తీవ్రవాదుల నుంచి 10 కిలోగ్రాముల పేలుడు పదార్థాల్ని కనుగొన్నారు. మెషీన్గన్లు, పిస్టోల్ సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. తీవ్రవాదుల్ని ఏరివేసేందుకు సౌదీ అరేబియా చేపడ్తున్న కార్యక్రమాలకు యూఏఈ మద్దతు పలికింది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







